ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం
- రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా వివాహం
- హాజరైన బాలీవుడ్ ప్రముఖులు
- వెడ్డింగ్ ఆల్బమ్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన కియారా
- ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరిన నటి
2021లో ‘షేర్షా’ సినిమాతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్-కియారాలు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ పెళ్లికి దారితీసింది. తమ వివాహ ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ.. దానికి.. ‘‘ఇప్పుడు మేం శాశ్వతంగా బుక్ అయిపోయాము’’ (అబ్ హమారీ పర్మనెంట్ బుకింగ్ హో గయీ హై) అని క్యాప్షన్ తగిలించారు. తమ ముందున్న ప్రయాణంలో మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. పెళ్లి ఫొటోల్లో కియారా లేత గులాబీరంగు లెహంగాలో, సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షేర్వానీలో కనిపించారు.