ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో ద్రాక్షారామం కుర్రాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో ద్రాక్షారామం కుర్రాడు!

Siva Teja Kakileti Got Place In Forbes List
  • యువ సాధకుల జాబితా టాప్-30ను ప్రకటించిన ఫోర్బ్స్ 
  • 23 అంతర్జాతీయ పేటెంట్లు సొంతం చేసుకున్న శివతేజ
  • బెంగళూరులో ‘నిరామయ్’ పేరుతో వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపన
  • రొమ్ము కేన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధన
ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన కాకిలేటి శివతేజ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో రొమ్ము కేన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. అలాగే, ఇప్పటి వరకు 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు సొంతం చేసుకున్నారు. ఆయన పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన యువసాధకుల టాప్-30 జాబితాలో శివతేజకు చోటు కల్పించింది.

ద్రాక్షారామానికి చెందిన శివతేజ ఐఐటీ గువాహటిలో ఈసీఈని మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో కొందరితో కలిసి నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్ కంపెనీని  స్థాపించారు. అందులో రొమ్ము కేన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తూ మెషీన్ లెర్నింగ్ టీంకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే, ఓ వైపు పరిశోధనల్లో మునిగి తేలుతూనే  నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్ యూనివర్సిటీలో క్లినికల్ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
Advertisement
Siva Teja Kakileti
Medical Imaging
Niramai
Forbes

More Telugu News