సినిమాలతో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నారు.. రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు: అంబటి
- రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదన్న అంబటి
- వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపని ధీమా
- లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతోందన్న మంత్రి
‘ముందస్తు’ పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని మంత్రి అంబటి అన్నారు.