పవన్ కల్యాణ్ ‘వీరమల్లు’ టీజర్ వచ్చేస్తోంది!
- క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం
- చివరి దశకు చేరుకున్న షూటింగ్
- ఈ నెల 26న టీజర్ వస్తుందన్న నిర్మాత ఎ.ఎం. రత్నం
మరోవైపు త్వరలోనే టీజర్ వస్తుందంటూ చిత్ర బృందం కొత్త పోస్ట్ ను వదిలింది. ఒకటి రెండు రోజుల్లో అధికార ప్రకటన రానుంది. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.