టాటా ఇండికా కారు వచ్చి 25 ఏళ్లు.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్
- 1998లో మార్కెట్లోకి వచ్చిన టాటా ఇండికా
- 25 సంవత్సరాల సంబరాల్లో పాల్గొన్న రతన్ టాటా
- ఇండికాతో దిగిన ఫొటోలను పంచుకున్న రతన్
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 25 సంవత్సరాల క్రితం టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది అన్నారు. ఇది మధురమైన జ్ఞాపకాలను తనకు గుర్తుచేస్తుందని చెప్పారు. తన హృదయంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఇండికా 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేశారు. కారును మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు.