హైదరాబాదులో షూటింగులో గాయపడిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి
- నగర శివార్లలో షూటింగ్
- యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అపశ్రుతి!
- రోహిత్ శెట్టిని ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించిన యూనిట్
కాగా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది.
నిర్మాతలు ఈ షెడ్యూల్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ షెడ్యూల్ లో కార్ చేజింగ్ లు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.