Karthik Raju: ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో 'అథర్వ' .. స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Atharva Special Poster Released
షార్ట్స్‌లో చూడండి
కార్తీక్ రాజు హీరోగా, సిమ్రన్ చౌదరి .. ఐరా హీరోయిన్లుగా నటించిన 'అథర్వ' సినిమాను వివిధ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను మహేష్‌ రెడ్డి రూపొందిస్తుండగా .. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించాడు .. ఈ రోజున ఆయన బర్త్ డే. 

ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌లకు మంచి స్పందన లభించింది. దాంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. 

ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టారు. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. లవ్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా అన్ని జోనర్లను టచ్ చేసేలా సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేశారు. 'డీజే టిల్లు' .. 'మేజర్' సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్‌ పాకాల, ఈ సినిమాకి బాణీలను సమకూర్చారు. కార్తిక్ రాజు .. సిమ్రన్ చౌదరి ..  ఐరా .. అరవింద్ కృష్ణ .. కబీర్ సింగ్ దుల్హన్ తదితరులు నటించిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు..
Go Back to Shorts
Karthik Raju
Simran Choudary
Mahesh Reddy
Atharva Movie

More Telugu News