రీ రిలీజ్ లోనూ రికార్డు బద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’
- న్యూ ఇయర్ కానుకగా తిరిగి విడుదల
- ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ. 4.15 కోట్ల వసూలు
- రీరిలీజ్ లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఘనత
ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. అయినా సరే దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాకు వచ్చినట్లు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. విడుదల చేసిన ప్రతిచోటా సినిమాకు నీరాజనం పలికారు. దీంతో తొలిరోజు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.4.15 కోట్లు వచ్చాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.62 కోట్ల వసూళ్లు దక్కాయి. రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఖుషి’ రికార్డు సాధించింది. ఇప్పటివరకు రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న తన ‘జల్సా’ రికార్డునే పవన్ బ్రేక్ చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం రీరిలీజ్ లో రూ. 1.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.