Advertisement

జగన్ ను నమ్ముకున్న నా వెంట ఉంటారో లేక చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్ వెంట ఉంటారో తేల్చుకోండి: అంబటి రాంబాబు

Ambati Rambabu fires on Pawan Kalyan
  • వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారన్న అంబటి
  • పవన్ అంత మగాడా అంటూ ఎద్దేవా
  • కాపులను చంద్రబాబు దొడ్లో కట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
ముఖ్యమంత్రి జగన్ ను నమ్ముకున్న తన వెంట ఉంటారో లేక చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ కల్యాణ్ వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారని... అంత మగాడా ఆయన? అని ప్రశ్నించారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కల్యాణ్ తన గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. 

విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని... అందుకే పవన్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని అన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా... తనపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Ambati Rambabu
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News