సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు ఫ్రాన్స్
- మొరాకోను 2-0తో చిత్తు చేసిన ఫ్రాన్స్
- ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్‌లో తలపడనున్న డిఫెండింగ్ ఛాంపియన్
- ఓడినా చరిత్ర సృష్టించిన మొరాకో
మరోవైపు, మ్యాచ్‌లో చాలా భాగం బంతి మొరాకో నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. మూడుసార్లు టార్గెట్‌వైపు దూసుకెళ్లినప్పటికీ గోల్ కొట్టడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. గ్రూప్ స్థాయి, నాకౌట్ మ్యాచుల్లో బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి బలమైన జట్లను కంగుతినిపించిన మొరాకో.. ఆఫ్రికా నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్‌లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతుంది.