పూనకాలు డబుల్.. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ.. అదిరిన ఫస్ట్ లుక్
- మాస్ మహారాజా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన చిరంజీవి
- ఫుల్ మాస్ యాక్షన్ లో రవితేజ
- జనవరి 13న విడుదల కానున్న చిత్రం
మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ఫస్ట్ లుక్ తో పాటు ఆయన పాత్రను పరిచయం చేసే టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని విలన్లతో ఫైట్ చేస్తూ రవితేజ పుల్ యాక్షన్ లో మోడ్ లో కనిపించారు. ‘ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తాంది’ అంటూ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. ‘ఏమిరా వారి పిస పిస జేస్తున్నవ్. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వని అయ్యకీ ఇననని’ అంటూ తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. రవితేజ పాత్రను చూశాక ఈ చిత్రంతో పూనకాలు డబుల్ అవడం ఖాయం అనిపిస్తోంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
.