శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు: అంబటి రాంబాబు

Ambati Rambabu counters Pawan Kalyan remarks
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన బస్సు యాత్ర కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనం రంగు మిలిటరీ వాహనాలను పోలి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆక్షేపించారు. ఇది నిబంధనలకు విరుద్ధం అన్నారు. అందుకు పవన్ కల్యాణ్ కూడా స్పందించి పలు వ్యాఖ్యలు చేశారు. నన్ను శ్వాస అయినా తీసుకోనిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. 

ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు అంటూ ఎత్తిపొడిచారు. కాగా, పవన్ బస్సుయాత్రం కోసం సిద్ధమైన వాహనం ఆలివ్ గ్రీన్ రంగులో ఉంది. సాధారణంగా సైనిక వాహనాలు ఈ రంగులో ఉంటాయి. సాధారణ ప్రజలు ఇలాంటి రంగులో వాహనాలను కలిగివుండడం నిబంధనలకు వ్యతిరేకమని మాజీ మంత్రి పేర్ని నాని నిన్న వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Ambati Rambabu
Pawan Kalyan
Bus
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News