బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటికి రావడానికి అదే కారణమని తేలింది: గీతూ

Bigg Boss 6  Update
  • 'బిగ్ బాస్ హౌస్'లో సందడి చేసిన గీతూ 
  • 9వ వారంలో ఎలిమినేట్ అయిన వైనం 
  • తాను ఓడిపోతానని అనుకోలేదన్న గీతూ
  • ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ఓడిపోయానని వెల్లడి
బిగ్ బాస్ హౌస్ లో గీతూ చేసిన సందడి అంతా ఇంతాకాదు. గీతూ ఆటతీరు చూసిన వాళ్లంతా ఆమె టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించారు. కానీ ఆమె 9వ వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావలసి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో నుంచి కూడా గీతూ సాధారణంగా బయటికి రాలేదు. తాను ఎలిమినేట్ అవుతానని తాను అనుకోలేదనీ, తనకి వెళ్లాలని లేదంటూ టీవీల ముందు కూర్చున్నవారిని ఏడిపించేసింది. 

తాజా ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ .. "హౌస్ లో ఉండగా నేను ఎప్పటికప్పుడు నా ఆటతీరును రివ్యూ చేసుకుంటూ ఉండవలసింది. కానీ నేను అలా చేయలేదు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ ఎక్కువగా కనిపించాయి. ఆ ఎమోషన్స్ నాకు కొంచెం తక్కువ కనుక, ఆడియన్స్ కి నేను కనెక్ట్ కాలేదని అనిపించింది. నేను బయటికి వచ్చిన తరువాత అసలు ఏం జరుగుతోందని రెండు రోజుల పాటు సోషల్ మీడియాను పరిశీలించాను" అంది. 

"సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను పరిశీలించిన తరువాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నేను బయటికి వచ్చానని చాలామంది కామెంట్లు పెట్టారు. నాక్కూడా అది నిజమేనని అనిపించింది. నిజానికి నేను గెలిచుంటే నా కాన్ఫిడెన్స్ ను అంతా అభినందించేవారు. ఓడిపోయాను గనుక ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించి ఉండొచ్చు" అంటా చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం బాలాదిత్య - వాసంతి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Geethu
Bigg Boss
Baladithya
Vasanthi

More Telugu News