Pawan Kalyan: వేమన విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహంపై పవన్ కల్యాణ్ స్పందన ఇదే!

Pawan Kalyan reacts over Vemana statue replaced by YS statue
షార్ట్స్‌లో చూడండి
కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీసింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వేమన రాసిన ఓ పద్యాన్ని తాత్పర్యంతో పాటు పంచుకున్నారు. 

విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.

ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వేమన విగ్రహం తొలగింపునకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Vemana Statue
YSR Statue
Yogi Vemana University

More Telugu News