'నేను స్టూడెంట్ సర్' టీజర్ రిలీజ్ డేట్ చెప్పిన హీరో!
- బెల్లంకొండ గణేశ్ రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్'
- ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానున్న ఫస్టు టీజర్
- కథానాయికగా భాగ్యశ్రీ కూతురు పరిచయం
- డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచన
ఆయన రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' అనే సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు 'నాంది' వంటి హిట్ సినిమాను నిర్మించిన సతీశ్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో రాఖి ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీన టీజర్ ను వదలనున్నట్టు హీరోతో చెప్పించారు.
ఇందులో బెల్లంకొండ గణేశ్ జోడీగా అవంతిక పరిచయం కానుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఆ బ్యూటీ ఎవరో కాదు 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ కూతురే. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు