'పుష్ప 2' .. అస్సలు తగ్గేదే లే: అల్లు అర్జున్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పుష్ప 2' .. అస్సలు తగ్గేదే లే: అల్లు అర్జున్

Urvasivo Rakshasivo Blackbuster Celebrations
  • 'ఉర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బన్నీ 
  • శిరీష్ హిట్ కొట్టడం పట్ల ఆనందం 
  • ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నానని వెల్లడి 
  • రాకేశ్ శశిపై ప్రశంసలు  
అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి 'ఊర్వశివో రాక్షసివో' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఈ స్టేజ్ పై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. 'ఈ సినిమా మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ ఫిల్మ్. ఇది మాకు ఎప్పటికీ ఒక స్వీట్ మెమరీలా నిలిచిపోతుంది. అలాంటి ఒక హిట్ ఇచ్చిన రాకేశ్ శశికి .. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నాడు. 

"ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ వర్క్ .. కెమెరా .. ఎడిటింగ్ .. మ్యూజిక్ అన్నీ కూడా కరెక్టుగా కుదిరాయి. సునీల్ .. వెన్నెల కిశోర్ .. అనూ ముగ్గురూ కూడా చాలా బాగా చేశారు. శిరీష్ గురించి మాట్లాడే టైమ్ కోసం నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అలాంటి ఒక సందర్భం, ఇప్పుడు వచ్చింది. నా సినిమా హిట్ అయినా నేను ఇంత సంతోషపడను" అన్నాడు.  

ఈ సినిమా రిలీజ్ కి ముందే తన గురించి చెబితే, తమ్ముడు కాబట్టి చెబుతున్నాడు అనుకుంటారు. హిట్ అయిన తరువాత తన ఎఫర్టును గురించి నేను మాట్లాడవచ్చు. తను చాలా బాగా చేశాడని అందరూ చెబుతూ ఉంటే హ్యాపీగా ఉంది. ఇక 'పుష్ప 2' గురించి నేను ఒక అప్ డేట్ ఇస్తాను. 'పుష్ప'లో 'తగ్గేదే లే' అన్నాను .. 'పుష్ప 2'లో మాత్రం 'అస్సలు తగ్గేదేలే' అంటూ ముగించాడు.
Allu Arjun
Allu Sirish
Anu Emmanuel
Urvasivo Rakshasivo Movie

More Telugu News