బన్నీ ముందు జాగ్రత్తగా మాట్లాడాలి .. ఎందుకంటే తను ఐకాన్ స్టార్: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీ ముందు జాగ్రత్తగా మాట్లాడాలి .. ఎందుకంటే తను ఐకాన్ స్టార్: దిల్ రాజు

Urvasivo Rakshasivo Blackbuster Celebrations
  • హిట్ టాక్ తెచ్చుకున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించిన టీమ్ 
  • బన్నీతో జర్నీని గుర్తుచేసుకున్న దిల్ రాజు 
  • అల్లు అరవింద్ గారి వల్లనే పాన్ ఇండియా స్థాయికి ఎదిగామని వెల్లడి

గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కి ఈ సినిమా సక్సెస్ ఊరట నిచ్చింది. అల్లు శిరీశ్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ బ్లాక్ బస్టర్  సెలెబ్రేషన్స్ ను నిర్వహించింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడారు. 

"ఈ ఫంక్షన్ లో ముందుగా ఏం మాట్లాడాలన్నా బన్నీ గురించే మాట్లాడాలి .. ఆయన ముందున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే తను ఐకాన్ స్టార్. 20 ఏళ్ల క్రితం నేను .. బన్నీ .. సుకుమార్ ముగ్గురం కూడా మా జర్నీని మొదలు పెట్టాము. ముగ్గురం కూడా ఈ రోజున పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాము. ఆ రోజున ' ఆర్య' కథను అల్లు అరవింద్ గారు ఓకే చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ ప్రతి కథ విషయంలో ఆయన అదే శ్రద్ధ తీసుకుంటూ ఉండటం విశేషం" అన్నారు. 

"దర్శక నిర్మాతలు ఒక మంచి టైటిల్ ను జనంలోకి తీసుకుని వెళ్లి హిట్ కొట్టారు. ఇక శిరీష్ విషయానికొస్తే, తను ఎక్కడ కలిసినా నాతో సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టినందుకు సంతోషంగా ఉంది. తనతో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను .. త్వరలోనే చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.
Allu Sirish
Anu Emmanuel
Vennela kishore
Urvasivo Rakshasivo Movie

More Telugu News