శిరీష్ కి ఈ సినిమా ఒక ఛాలెంజ్: అల్లు అరవింద్
- అల్లు శిరీష్ హీరోగా విభిన్న కథాచిత్రం
- దర్శకుడిగా రాకేశ్ శశి
- శిరీష్ పాత్రను గురించిన ప్రస్తావన
- సక్సెస్ మీట్ లో మాట్లాడతానన్న అల్లు అరవింద్
ఈ స్టేజ్ పై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. " ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవగానే బాలకృష్ణగారు మాపై గల ప్రేమతో వెంటనే ఒప్పుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఏ విషయమైనా సరే నాన్చడం బాలకృష్ణగారికి ఇష్టం ఉండదు. ఆయనలోని ఆ సింపుల్ యాటిట్యూడ్ కి అందరం అభిమానులమై ఉండాలి. ఇక ఈ కథ తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర ఉంటే అడిగి తీసుకున్నాను" అని అన్నారు.
శిరీష్ జూబ్లీహిల్స్ బాయ్ .. మధ్యతరగతి కుర్రాడిగా ఈ సినిమాలో చేయడమనేది అతనికి ఒక ఛాలెంజ్. అతణ్ణి అలా చూపించడం డైరెక్టర్ కి ఒక ఛాలెంజ్. సినిమాను నేను చూశాను .. శిరీష్ ఆ పాత్రలో ఒప్పించాడు. ఇంతకుమించి ఈ సినిమాను గురించి ఇప్పుడు చెప్పను .. సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఈ ఫంక్షన్ కి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.