పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ.. ఫొటోలు ఇవిగో

Actress Poorna got marriage
  • ప్రియుడు ఆసిఫ్ అలీని పెళ్లాడిన పూర్ణ
  • దుబాయ్ లో ఘనంగా వివాహ వేడుక
  • కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన పూర్ణ, అలీ
ప్రముఖ సినీ నటి, ఢీ డ్యాన్స్ షో జడ్జి పూర్ణ అలియాస్ షామ్నా ఖాసీం పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లాడింది. వీరి వివాహం నిన్న రాత్రి దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తమ వివాహానికి సంబంధించి ఫొటోలను ఆమె సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఆమె ఒక క్యాప్షన్ కూడా పెట్టింది.

'నేను ప్రపంచంలోనే అంత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు. మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉండకపోవచ్చు. కానీ, నన్ను నా కంటే తక్కువగా ఊహించుకునేలా మీకు ఎప్పుడు చేయలేదు. మీరు నన్ను ఎంతో అభిమానించారు. నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నాలో ఉన్న ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సహించారు. ఈరోజు మన ప్రియతముల మధ్య ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను. జీవితంలో వచ్చే సుఖదుఃఖాలన్నింటినీ మీతో కలిసి పంచుకుంటూ సంతోషకర జీవితాన్ని గడుపుతా' అని తన భర్తను ఉద్దేశించి పేర్కొంది. 
Go Back to Shorts
Poorna
Tollywood
Marriage

More Telugu News