మెగాస్టార్ తో రవితేజ స్టెప్పులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాస్టార్ తో రవితేజ స్టెప్పులు!

Waltair Veerayya movie update
  • మైత్రీ బ్యానర్లో రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య'
  • మెగాస్టార్ సరసన అలరించనున్న శ్రుతి హాసన్ 
  • ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న రవితేజ 
  • మాస్ మసాలా సాంగును ట్యూన్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్  
చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. సినిమాలో ఆయన పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎంట్రీ ఇస్తుంది. సెకాండాఫ్ లో చిరూ .. సల్మాన్ మధ్య ఒక సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే పద్ధతి చిరంజీవి 154వ సినిమాగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలోను కొనసాగనుంది. కాకపోతే ఈ సినిమాలో చిరంజీవితో రవితేజ కనిపించనున్నాడు. 

మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి సవతి తల్లి కొడుకు పాత్రలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ రవితేజ ఎంట్రీ పై ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవిని సపోర్టు చేసే ఈ పాత్రలో రవితేజ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చిరూ - రవితేజ కాంబినేషన్లో ఒక మాస్ మసాలా సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. 

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు. చిరూ - రవితేజ స్టెప్పులు మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తాయని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, కేథరిన్ .. రాజేంద్ర ప్రసాద్ .. వెన్నెల కిశోర్ .. బాబీ సింహా ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Chiranjeevi
Sruthi Haasan
Raviteja
Waltair Veerayya

More Telugu News