తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన త్రిష

Trisha response on her marriage
  • మనసుకు నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకుంటానన్న త్రిష
  • తనను చేసుకునేవాడికి తనపై నమ్మకం ఉండాలని వ్యాఖ్య
  • విడాకులు తీసుకోవడం తనకు నచ్చదన్న త్రిష
దక్షిణాది అందాల భామ త్రిష తాజాగా 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటించి అభిమానులను మెప్పించింది. మరోవైపు త్రిష పెళ్లిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇంత వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు తెలియదని... మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటానని తెలిపింది. 

తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి తనపై పూర్తి నమ్మకం ఉండాలని, అతను తన జీవితాంతం తనకు తోడుగా ఉంటాడని అనిపించాలని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం తనకు నచ్చదని తెలిపింది. గతంలో తమిళ నిర్మాత వరుణ్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్లకే ఇద్దరూ బ్రేకప్ అయ్యారు.
Trisha
Marriage
Tollywood
Kollywood

More Telugu News