'పొన్నియిన్ సెల్వన్' స్టార్స్ పారితోషికాలు ఇవేనంటూ చెన్నై టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పొన్నియిన్ సెల్వన్' స్టార్స్ పారితోషికాలు ఇవేనంటూ చెన్నై టాక్!

Ponniyan Selven Movie Update
  • రేపు విడుదలవుతున్న 'పొన్నియిన్ సెల్వన్'
  • మణిరత్నం కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ ఇది
  • విక్రమ్ 12 కోట్లు .. ఐశ్వర్య రాయ్ 10 కోట్లు?  
మణిరత్నం తన కెరియర్లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథాంశాన్ని ఎంచుకున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. బడ్జెట్ పరంగా .. భారీ తారాగణం పరంగా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ నెల 30వ తేదీ కోసమే సినిమా ప్రేమికులంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎవరు ఎంత పారితోషికం అందుకున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విక్రమ్  తీసుకున్న మొత్తం ఎక్కువనా? లేదంటే ఆ ఐశ్వర్య రాయ్ అందుకున్నది ఎక్కువనా? అనేది తెలుసుకోవడానికి మరికొందరు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

ఈ సినిమా కోసం విక్రమ్ 12 కోట్లు .. ఐశ్వర్య రాయ్ 10 కోట్లు .. జయం రవి 8 కోట్లు .. కార్తి 5 కోట్లు .. త్రిష 2.5 కోట్లను అందుకున్నారనేది చెన్నై టాక్. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఎవరి పాత్ర ఎక్కువ కనెక్ట్ అవుతుంది .. ఎవరి పాత్ర ఎక్కువ హైలైట్ అవుతుందనేది రేపు తేలనుంది.
Vikram
Karthi
jayam Ravi
Ponniyin Selvan

More Telugu News