క్రైమ్ థ్రిల్లర్ గా 'అథర్వ' .. సిమ్రాన్ చౌదరి ఫస్టులుక్ రిలీజ్!
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే 'అథర్వ'
- ఆసక్తిని రేపుతున్న ఫస్టు లుక్
- దర్శకుడిగా మహేశ్ రెడ్డి పరిచయం
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా సిమ్రాన్ చౌదరి అలరించనుంది. సుభాశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సిమ్రాన్ చౌదరి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే కథానాయిక ఏదో ఆపదలో ఉన్నట్టుగా ... ఎలా తప్పించుకోవాలో తెలియక భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఫస్టు లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచగలిగారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కబీర్ దుహాన్ సింగ్ .. ఐరా .. అరవింద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి మరి.