రాజమౌళి .. సుకుమార్ తో పోల్చకండి: చందూ మొండేటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి .. సుకుమార్ తో పోల్చకండి: చందూ మొండేటి

Karthikeya 2 movie update
  • ఈ నెల 13వ తేదీన విడుదలైన 'కార్తికేయ 2'
  • 15 రోజులు తిరగముందే 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ
  • కర్నూల్ లో జరిగిన సెలబ్రేషన్స్
  • రాజమౌళి .. సుకుమార్ లకి ఏకలవ్య శిష్యుడినన్న డైరెక్టర్ 
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా విడుదలైంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 15 రోజులలోపే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 'కర్నూల్'లో సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. 

"ఒక రాజమౌళి .. ఒక సుకుమార్ మాదిరిగా చందూ మొండేటి కూడా 100 కోట్ల సినిమా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు" అంటూ యాంకర్ స్టేజ్ పై చెబుతుండగా, అందుకు చందూ మొండేటి అడ్డుపడ్డాడు. "మీరు మాటిమాటికి వాళ్లతో నన్ను పోల్చకండి. వాళ్లిద్దరికీ నేను ఏకలవ్య శిష్యుడిని. నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ గా చేస్తావా? వాళ్ల దగ్గర అసిస్టెంట్ గా చేస్తావా? అని అడిగితే, వాళ్ల దగ్గరే జాయినైపోతాను" అన్నాడు. 

"నాకు రాజమౌళిగారన్నా .. సుకుమార్ గారన్నా ఎంతో ఇష్టం .. అంతకి మించిన గౌరవం ఉన్నాయి. వాళ్లతో నన్ను పోల్చుతుంటే నాకు భయం వేస్తుంది" అని అన్నాడు. "ఇంతకుముందు ఏ మాత్రం పరిచయం లేని నిఖిల్ గురించి ఈ రోజున హిందీ వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా సాధించిన సక్సెస్ కి ఇంతకుమించిన నిదర్శనం లేదు" అంటూ సింపుల్ గా ముగించాడు.
Rajamouli
Sukumar
Chandu Mondeti
Karthikeya 2 Movie

More Telugu News