సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్... అనసూయకు మద్దతుగా శ్రద్ధా దాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్... అనసూయకు మద్దతుగా శ్రద్ధా దాస్

Shraddha Das came into support for Anasuya
  • మరోసారి ట్రోలింగ్ కు గురైన అనసూయ
  • నేను ఆంటీని కాదంటూ ఫైర్
  • నీకన్నా చిన్నవాళ్ల కంటే చాలా యంగ్ గా ఉన్నావన్న శ్రద్ధా దాస్
  • తనను ట్రోల్ చేసి ఉపయోగం లేదని హితవు
ప్రముఖ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ మరోసారి ట్రోలింగ్ కు గురయ్యారు. తనను ఆంటీ అంటున్నారని, కించపరిచే పదజాలం ఉపయోగిస్తున్నారని అనసూయ వెల్లడించారు. కాగా, ట్రోలింగ్ మితిమీరిపోవడంతో అనసూయకు మద్దతుగా ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ రంగంలోకి దిగింది. 

"నీ వయసులో సగం ఉన్నవారి కంటే నువ్వే యంగ్ గానే ఉన్నావు" అంటూ అనసూయను ఊరడించింది. "నిన్ను చూస్తే అదిరిపోవాలంతే! నీ వయసుకు రెట్టింపు ఉన్న అంకుల్స్ కంటే హాట్ గా ఉన్నావు... నీ అభిమానినైపోయా" అంటూ శ్రద్ధా దాస్ ట్వీట్ చేసింది. 

దాంతో నెటిజన్లు తమ దృష్టిని శ్రద్ధా దాస్ వైపు మరల్చారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో, శ్రద్ధా మరో పోస్టు చేసింది. "బాబూ... మీరు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. నన్ను దూషిస్తూ మీ శక్తిని వృథా చేసుకుంటున్నారు. నన్ను తిడితే బ్లాక్ చేయడమో, డిలీట్ చేయడమో చేస్తానంతే. అనసూయను మెచ్చుకున్నందుకు మీరు నన్ను ట్రోల్ చేయడంలో అర్థం లేదు" అంటూ హితవు పలికింది.
Shraddha Das
Anasuya
Trolling
Social Media
Tollywood

More Telugu News