Payyavula Keshav: ఎన్నికల తర్వాత జగన్ కు చుక్కలు చూపిస్తాం: పయ్యావుల కేశవ్
చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటని అన్నారు. టీడీపీ కార్యకర్తపై చెయ్యి ఎత్తిన ఏ ఒక్కడినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీ కార్యకర్త రక్తం చూసిన ఎవరినీ వదలబోమని అన్నారు.
తమ పార్టీ కార్యకర్త నుంచి కారిన ప్రతి రక్తపు చుక్క రేపు చురకత్తి కాబోతోందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ కు చుక్కలు చూపిస్తామన్నారు. టీడీపీ కార్యకర్త తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. జగన్ రెడ్డికి సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. సిగ్గున్న వాళ్లు పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ఎలా ధ్వంసం చేస్తారని అడిగారు.