రామోజీ ఫిలింసిటీ, ఐఆర్ సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం

Tourism agreement between Ramoji Film City and IRCTC
  • షూటింగ్ లకు, పర్యాటకానికి ప్రముఖ స్థానంగా రామోజీ ఫిలింసిటీ
  • ఒప్పందంపై సంతకాలు చేసిన విజయేశ్వరి, నరసింగరావు
  • ఫిలింసిటీకి ఐఆర్ సీటీసీ తోడ్పాటు
  • పర్యాటకులకు ప్రయోజనం కల్పించేలా ఒప్పందం
సినిమా చిత్రీకరణలకు, పర్యాటకానికి నెలవుగా మారిన రామోజీ ఫిలింసిటీ, ఐఆర్ సీటీసీ మధ్య టూరిజం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై రామోజీ ఫిలింసిటీ తరఫున ఎండీ విజయేశ్వరి, ఐఆర్ సీటీసీ తరఫున దక్షిణ మధ్య జోనల్ జీఎం నరసింగరావు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం... రామోజీ ఫిలింసిటీ పర్యాటకులను ఆకర్షించేలా ఐఆర్ సీటీసీ తోడ్పాటు అందిస్తుంది. దేశవ్యాప్తంగా పర్యాటక సంస్థలకు రామోజీ ఫిలింసిటీ గురించి ఐఆర్ సీటీసీ సమాచారం అందిస్తుంది. రామోజీ ఫిలింసిటీ ప్యాకేజీలపై పర్యాటకులకు ఐఆర్ సీటీసీ అవగాహన కల్పించనుంది. ఫిలింసిటీకి వచ్చే పర్యాటకులకు కూడా ప్రయోజనం కలిగించేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
Go Back to Shorts
Ramoji Film City
IRCTC
Tourism
India

More Telugu News