నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాడలేము కదా..!: జాన్వీ కపూర్
- తనకు నచ్చినవాడిని మనువాడే స్వేచ్ఛ ఉందన్న జాన్వీ
- అమ్మా, నాన్నకు అదే ఇష్టమని వెల్లడి
- డేటింగ్ అంటే వారికి ఇష్టం లేదని స్పష్టీకరణ
డేటింగ్ విషయంలో తన తల్లిదండ్రులది భిన్నమైన అభిప్రాయమని జాన్వీ చెప్పింది. ‘‘డేటింగ్ అన్నది ఓ సందర్భం. ఎందుకో తెలియదు కానీ, మామ్, డాడీ దీని విషయంలో ఎంతో నాటకీయంగా ఉంటారు. ‘నీవు ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే మా దగ్గరకు తీసుకురా, పెళ్లి చేస్తాం’ అన్నట్టు వారు ఉండేవారు. అయితే, నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లాడలేము కదా. మనకు కొంచెం చిల్ కూడా ఉండాలి’’ అని జాన్వీ కపూర్ తెలిపింది. జాన్వీ కపూర్ లోగడ శిఖర్ పహారియాతో డేటింగ్ నడపడం తెలిసిందే. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జొహార్ కూడా బయటపెట్టారు.