'కార్తికేయ 2' కష్టాలు మాకు మాత్రమే తెలుసు: నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కార్తికేయ 2' కష్టాలు మాకు మాత్రమే తెలుసు: నిఖిల్

Karthikeya 2 movie update
  • 'కార్తికేయ 2' ప్రమోషన్స్ జోరు 
  • సముద్రంలోను షూట్ చేశామన్న నిఖిల్ 
  • విజువల్స్ అద్భుతం అంటారంటూ వ్యాఖ్య 
  • ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల
నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది.

నిఖిల్ మాట్లాడుతూ .. "కథ డిమాండ్ చేయడం వలన మేము గుజరాత్ పరిసర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం కోసం సముద్రంలోకి కూడా వెళ్లవలసి వచ్చింది. మేము ఏయే ప్రదేశాలలో షూట్ చేశామో .. ఎక్కడ ఎన్నెన్ని కష్టాలు పడ్డామో చెబితే ఎవరూ కూడా అక్కడికి షూటింగులకు వెళ్లరు.

ఎక్కడా కూడా ఉండటానికి సరైన హోటల్స్ లేవు .. తినడానికి సరైన ఫుడ్ లేదు. మాకంటే అనుపమ ఎక్కువ ఇబ్బంది పడింది. మేము అనుకున్న విజువల్స్ అద్భుతంగా రావడం వలన, పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని అనుకుంటున్నాము. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన విజువల్స్ అనకుండా ఉండలేరు" అంటూ చెప్పుకొచ్చింది.
Nikhil
Anupama
Karthikeya 2

More Telugu News