Tollywood: ఎన్టీఆర్​, కొరటాల శివ కొత్త చిత్రం నుంచి అప్​డేట్​ వచ్చేసింది

Jr NTR And Koratala Sivas NTR30 To Go On Floors Soon
షార్ట్స్‌లో చూడండి
‘ఆర్ఆర్ఆర్’తో కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో తన నటనతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు చిత్రాలు ఒప్పుకున్నాడు. ఓ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనుండగా.. మరోదానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. 

కానీ, వీటిలో ఒక్కటి కూడా ఇంకా పట్టాలెక్కకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. నిజానికి కొరటాల చిత్రం ఇప్పటికే మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇక ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పడే సమయం వచ్చినట్టే ఉంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ రెండో వారం నుంచి మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో భారీ సెట్ వేస్తున్నారట. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా ‌మేకోవర్‌‌పై దృష్టి పెట్టాడని సమాచారం. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తిచేసి వచ్చే సంక్రాంతికి  సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా ఆలియా భట్, కీర్తి సురేష్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే, ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తాడన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Go Back to Shorts
Tollywood
Jr NTR
RRR
Koratala Siva
new movie

More Telugu News