నేడు ధోనీ 41వ పుట్టినరోజు... నందిగామలో 41 అడుగుల భారీ కటౌట్
- దేశవ్యాప్తంగా ధోనీ జన్మదిన వేడుకలు
- ఏపీలోనూ సంబరాలు
- కటౌట్ ఏర్పాటు చేసిన తెలుగు ధోనీ ఫ్యాన్స్
- రిటైరైనా తగ్గని క్రేజ్
ఏపీలోనూ ధోనీ ఫ్యాన్స్ సంబరాలు మామూలుగా లేవు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ 41వ బర్త్ డేని పురస్కరించుకుని తెలుగు ధోనీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాన్నాళ్లయినా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం.
.