Chinthamaneni Prabhakar: నీచమైన ప్రచారాలు చేస్తున్నారు.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా?: చింతమనేని
- పటాన్ చెరులో కోడి పందేల వ్యవహారం
- చింతమనేని హస్తం ఉందంటూ వార్తలు
- మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్న చింతమనేని
హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరులో జరిగిన కోడి పందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హస్తం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేని స్పందిస్తూ... రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని అన్నారు. కోడి పందేల్లో లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్టు చూపించడం కొందరి రాజకీయ జెండా, అజెండా అని విమర్శించారు.
నీచమైన ప్రచారాలు చేస్తూ, కుప్పకూలిపోయే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఆ మేడలు కూలిపోయే సమయం ఆసన్నమయిందని అన్నారు. అసత్యాల 'సాక్షి'ని ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయిందని చెప్పారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.