24 గంటల్లో మీ పదవులు పోతాయి... షిండే వర్గంలోని మంత్రులకు శివసేన వార్నింగ్
- మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
- శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే
- రెబెల్ మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తామన్న రౌత్
- షిండేనే నిర్ణయం తీసుకుంటారన్న రెబెల్ ఎమ్మెల్యే పాటిల్
మరోవైపు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయ శత్రువులని, అలాంటి పార్టీలతో భాగస్వామ్యం అనైతికమని షిండే వర్గం ఎమ్మెల్యే చిమన్ రావు పాటిల్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలు తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయని, అలాంటి పార్టీలతో పొత్తు సరికాదని అన్నారు. సీఎం ఉద్ధవ్ థాకరే ఇకనైనా సహజసిద్ధ పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, ఉద్ధవ్ థాకరే నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఇక తమ నాయకుడు ఏక్ నాథ్ షిండేనే నిర్ణయం తీసుకుంటారని పాటిల్ వెల్లడించారు.