ట్రంప్‌ ఏ అంతస్తులో ఉన్నారో కూడా తెలుసుకున్న ఇరాన్‌.. టర్కీలో అసలు ఏం జరిగింది?

Iran knew which floor Trump was on what actually happened in Turkey
  • టర్కీ పర్యటనలో ట్రంప్‌ విమానంపై క్షిపణి దాడి ముప్పు
  • ముందే పసిగట్టిన అమెరికా నిఘా వర్గాలు
  • ట్రంప్‌ నివాసం ఉన్న అంతస్తు సహా సమాచారం సేకరించిన ఇరాన్‌
  • ట్రంప్‌ ఎక్కిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను ‘డీకాయ్‌’గా పంపిన వైనం
  • ట్రంప్‌ను క్యాటరింగ్‌ కంటైనర్‌ ద్వారా రహస్యంగా తరలింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల టర్కీ నుంచి బయటపడిన సమయంలో భారీ భద్రతా ఆపరేషన్‌ చేపట్టినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది. టర్కీ నుంచి ట్రంప్‌ ప్రయాణించే విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతోనే ఆయన విమానం మార్చినట్లు తెలిపింది. అంతేకాదు.. అంకారాలో ట్రంప్‌ బస చేసిన భవనం, ఆయన ఉన్న అంతస్తు వివరాలు కూడా ఇరాన్‌ అనుకూల వర్గాలకు తెలిసినట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయని పేర్కొంది.

జులై 8న నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్‌ అంకారా నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అమెరికా నిఘా సంస్థలకు పలు మార్గాల్లో ముప్పు సమాచారం అందింది. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణితో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. సదస్సు సమీపంలో భుజంపై మోసుకెళ్లే క్షిపణితో ఓ వ్యక్తి కనిపించినట్లు కూడా సమాచారం అందింది.

ట్రంప్‌ పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లోనే బయలుదేరుతారని ముందుగా ప్రకటించారు. కెమెరాల ముందే ఆ విమానంలోకి ఎక్కారు. దీంతో ఆయన అందులోనే వెళ్తారని అంతా భావించారు. కానీ అది భద్రతా వ్యూహంలో భాగం. వైట్‌హౌస్‌ సిబ్బంది, భద్రతా సిబ్బంది, సహాయకులు, మీడియా ప్రతినిధులతో ఆ విమానాన్ని ‘డీకాయ్‌’గా గాల్లోకి పంపారు.

ట్రంప్‌ను మాత్రం విమానాశ్రయంలోని క్యాటరింగ్‌ కంటైనర్‌ ద్వారా రహస్యంగా తరలించారు. అనంతరం చిన్న సైనిక విమానంలో టర్కీ నుంచి బయటకు పంపారు. ఈ ఆపరేషన్‌లో మీడియా ప్రతినిధులు తమకు తెలియకుండానే ‘డీకాయ్‌’ బృందంలో భాగమయ్యారు.

ఖతార్‌ బహుమతిగా ఇచ్చిన విలాసవంతమైన బోయింగ్‌ 747లో ట్రంప్‌ టర్కీకి వెళ్లారు. అయితే దానికి పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఉన్న క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు లేవని సమాచారం. దీంతో తిరుగు ప్రయాణానికి పాత విమానాన్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తన విమానం మార్పుపై ట్రంప్‌ మాత్రం పెద్దగా ఆందోళన చెందలేదు. ‘‘ఏదో ముప్పు ఉందని అనుకుంటా. దాని గురించి ఎక్కువగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’’ అని చెప్పారు.
Advertisement
Donald Trump
Iran
Turkey
Air Force One
Missile threat
Security operation

More Telugu News