సంపూర్ణ సూర్య గ్రహణంతో స్పెయిన్, రష్యాల్లో పగలే చీకట్లు.. భారత్‌లో ఎందుకు కనపడలేదంటే..!
- యూరప్‌లోని పలు ప్రాంతాల్లో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం
- పగటిపూటనే కొన్ని నిమిషాల పాటు కమ్ముకున్న చీకట్లు
- 1999 తర్వాత యూరప్‌లో ఇదే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం
- భారత్‌లో రాత్రి సమయం కావడంతో గ్రహణం కనిపించని వైనం
- 2026లో ఏర్పడిన ఏకైక సంపూర్ణ గ్రహణం ఇదే
ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో నిన్న అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. 2026 సంవత్సరంలో ఏకైక సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్‌లోని కొన్ని దేశాల్లో పగటిపూటనే చీకట్లను నింపింది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు దీన్ని ఆసక్తిగా వీక్షించారు.
భూమికి, సూర్యుడికి మధ్యగా చంద్రుడు అడ్డుగా రావడంతో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 నిమిషాల 18 సెకన్ల పాటు పగలే రాత్రిని తలపించేలా చిమ్మచీకట్లు అలముకున్నాయి. యూరప్, వాయవ్య ఆఫ్రికా, ఈశాన్య ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం దర్శనమిచ్చింది. పశ్చిమ యూరప్‌లోని కొన్ని చోట్ల సూర్యాస్తమయం వేళ ఈ గ్రహణం ఏర్పడటంతో 'సన్‌సెట్ ఎక్లిప్స్' అనే అరుదైన దృశ్యం కనువిందు చేసింది.
సాధారణంగా కనిపించని సూర్యుడి బాహ్య వాతావరణమైన 'కరోనా'ను అధ్యయనం చేసేందుకు ఈ గ్రహణం శాస్త్రవేత్తలకు ఒక సువర్ణావకాశాన్ని అందించింది. కాగా, ఈ గ్రహణం ఏర్పడిన సమయంలో భారత్‌లో రాత్రి కావడంతో ఇక్కడి ప్రజలకు కనిపించే అవకాశం లేకుండా పోయింది.