'సీతా రామం' టీజర్ రిలీజ్!
- హను రాఘవపూడి నుంచి మరో విభిన్న ప్రేమకథా చిత్రం
- దుల్కర్ జోడీగా నటించిన మృణాళిని ఠాకూర్
- కీలకమైన పాత్రలో రష్మిక
- ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
తనవారంటూ ఎవరూ లేని ఒంటరితనంతో కథానాయకుడు బాధపడుతూ ఉంటే, అతని భార్య సీతామహాలక్ష్మిని అంటూ ఒక యువతి నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం ఎవరు రాశారనేది అతనికి తెలియదు .. సీత ఎవరనేది తెలియదు. అప్పుడు అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం టీజర్ ద్వారా తెలుస్తోంది.
'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో రష్మిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఏమిటనేది కూడా ఉత్కంఠను పెంచుతోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆగస్టు 5వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.