'మహా' సీఎం ఉద్ధవ్ థాకరేకి కరోనా పాజిటివ్
- ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్న థాకరే
- రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో కరోనా బారిన పడిన థాకరే
- మహారాష్ట్ర గవర్నర్ కొశ్యారీకి కూడా కరోనా
మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కూడా కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడినట్టు ఈ ఉదయం ఆయన వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరానని చెప్పారు.