ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ఆత్మ‌హ‌త్య‌పై ఉపాస‌న భావోద్వేగ ట్వీట్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ఆత్మ‌హ‌త్య‌పై ఉపాస‌న భావోద్వేగ ట్వీట్‌

Upasana Konidela emotional tweeton prathyusha demise
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్ర‌త్యూష‌
  • ప్ర‌త్యూష త‌న‌కు డియ‌రెస్ట్ ఫ్రెండ్ అన్న ఉపాస‌న‌
  • ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలంటూ ఉపాస‌న ట్వీట్‌
హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ఆత్మ‌హ‌త్యోదంతంపై టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రాంచ‌ర‌ణ్ భార్య ఉపాస‌న భావోద్వేగ‌భ‌రిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ప్ర‌త్యూష‌ను ఉపాస‌న త‌న డియ‌రెస్ట్ ఫ్రెండ్ అంటూ పేర్కొన్నారు. ప్ర‌త్యూష చాలా త్వ‌ర‌గానే వెళ్లిపోయింద‌ని, ప్ర‌త్యూష మ‌ర‌ణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని ఆ పోస్ట్‌లో ఉపాస‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ప్ర‌తి విష‌యంలోనూ ఉన్న‌తంగానే ఉండేవార‌ని..కెరీర్ ప‌రంగా, కుటుంబం, స్నేహితుల ప‌రంగానూ ఉన్న‌త నిర్ణ‌యాలే తీసుకునేద‌ని ఉపాస‌న పేర్కొన్నారు. అన్ని విష‌యాల్లో ఉన్న‌తంగా ఉన్న ప్ర‌త్యూష డిప్రెష‌న్‌కు గురి కావడం బాధ క‌లిగిస్తోంద‌ని తెలిపారు. ప్ర‌త్యూష ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఉపాస‌న ఆకాంక్షించారు. త‌న‌తో క‌లిసి ప్ర‌త్యూష దిగిన ఫొటోను ఉపాస‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.
Upasana Konidela
Prathyusha Garimella
Fashion Designer
Hyderabad
Twitter

More Telugu News