'విక్రమ్' దర్శకుడికి కమల్ ఖరీదైన కానుక!

Vikram movie update
కమల్ తన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమాను నిర్మించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 3వ తేదీన విడుదలైంది. హీరోయిన్ లేకుండా ఐదుగురు స్టార్స్ తో మొదటి నుంచి చివరి వరకూ లోకేశ్ కథను నడిపించాడు. కమల్ స్థాయికి తగిన భారీతనం ఎక్కడా తగ్గకుండా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. 

అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లోనే కాదు, విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. చాలా గ్యాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా భారీ సక్సెస్ ను కమల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో .. ఈ సంతోషంలో ఆయన ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి ఖరీదైన కారును కానుకగా అందజేశారు.

 కోటి రూపాయలకి పైగా ఖరీదైన 'లెక్సస్ సెడాన్' కారును కానుకగా లోకేశ్ అందుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లోకేశ్ ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చాడనీ .. అలాంటి వాళ్లంటే తనకి ఇష్టమని చెబుతూ వచ్చిన కమల్, అతని పట్ల తనకి గల అభిమానాన్ని  ఇలా చాటుకోవడం విశేషం.
Go Back to Shorts
Kamal Haasan
Surya
Vijat Sethupathi
Vikram Movie

More Telugu News