Virataparvam: ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'విరాటపర్వం'... కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం

Virataparvam release date announced
షార్ట్స్‌లో చూడండి
రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాటపర్వం చిత్రాన్ని జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం నేడు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. 

ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో, చిత్రబృందం విడుదల తేదీని నిర్ధారించింది. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత. 

దగ్గుబాటి సురేశ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. విరాటపర్వం చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.
Go Back to Shorts
Virataparvam
Release Date
Rana Daggubati
Sai Pallavi
Venu Udugula

More Telugu News