Chandrababu: వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్లు యువ‌త‌కు ఇస్తాం: చంద్ర‌బాబు

chandrababu slams ycp
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని బోస్టన్ లో నిర్వ‌హించిన‌ మహానాడును ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వర్చువల్ గా మాట్లాడుతూ వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్‌ పాలనలో ఏపీ కోలుకోలేనంత న‌ష్ట‌పోయింద‌ని అన్నారు. అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని ఆయ‌న విమ‌ర్శించారు. ధరలు భారీగా పెంచేశారని, వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్ర‌జ‌లు నిలదీస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. 

ఏపీలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌తో పాటు కేసుల్లో ఉన్న వారికి జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్లు యువ‌త‌కు ఇస్తాన‌ని చెప్పారు. టీడీపీని అధికారంలోకి తేవడంలో ఎన్ఆర్ఐలూ కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News