ప్రత్యేక విమానంలో కేసీఆర్ పక్క సీటు!... ఆనంద డోలికల్లో టీఆర్ఎస్ ఎంపీ!
- ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్
- కేసీఆర్ పక్క సీటులో కూర్చుని ఢిల్లీకి చేరిన రంజిత్ రెడ్డి
- కేసీఆర్ పక్క సీటు లభించడం ఓ గౌరవంగా భావిస్తున్నానన్న ఎంపీ
ప్రత్యేక విమానంలో కేసీఆర్ పక్క సీటులో ప్రయాణించడం గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పక్కన కూర్చుంటే ఉత్సాహంగా ఉంటుందని, ఆయా అంశాలపై కేసీఆర్ చేసే లోతైన విశ్లేషణ ఉత్తేజంగా ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ పక్క సీటులో కూర్చున్న తన ఫొటోను కూడా రంజిత్ రెడ్డి పోస్ట్ చేశారు.