YSRCP: వైసీపీ ఎమ్మెల్యేల‌తో టీడీపీ సీనియ‌ర్ల లోపాయికారీ ఒప్పందాలు: మాజీ మంత్రి అనిల్‌

yscrp mla anil kumar yadav alleges tdp senior leaders in agreements with ysrcp mlas
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ కీల‌క నేత‌, ఏపీ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ సోమ‌వారం ఓ కీల‌క ఆరోప‌ణ చేశారు. టీడీపీకి చెందిన చాలా మంది సీనియ‌ర్ నేత‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌తో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యాన్ని తాను రుజువు చేయ‌గ‌ల‌న‌ని కూడా అనిల్ చెప్పారు.

నెల్లూరుకు చెందిన రియ‌ల్ట‌ర్ కిన్నెర ప్ర‌సాద్‌కు తాను బినామీగా ఉన్నానంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించేందుకు సోమ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన అనిల్‌.. ఈ దిశ‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తానేమీ కిన్నెర ప్ర‌సాద్‌కు బినామీగా లేన‌ని ఆయ‌న స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా...కిన్నెర ప్ర‌సాద్ నాలుగు లే అవుట్లు వేశార‌ని అనిల్ చెప్పారు. మ‌రి నాడు మంత్రులుగా ఉన్న లోకేశ్ గానీ, నారాయ‌ణ గానీ కిన్నెర‌కు బినామీలుగా ఉన్నారా? అని అనిల్ ప్ర‌శ్నించారు.
Go Back to Shorts
YSRCP
Anil Kumar Yadav
Nellore
Nara Lokesh

More Telugu News