మాజీ సీఎం కొడుకు అయినంత మాత్రాన ఏది పడితే అది అడిగేస్తారా?: నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి ఫైర్
- సాగుపై జగన్‌కు లోకేశ్ ప్రశ్నాస్త్రాలు
- లోకేశ్ లేఖపై మంత్రి కాకాణి మండిపాటు
- రైతు, కౌలు రైతు అంటే లోకేశ్‌కు తెలుసా?
- లోకేశ్ ఏమైనా హరిత విప్లవ పితామహుడా అన్న కాకాణి
నారా లోకేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తనకే ఇబ్బందిగా ఉందని కూడా కాకాణి వ్యాఖ్యానించారు. అసలు లోకేశ్ కు రైతు, కౌలు రైతు అంటే ఏమిటో తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ, ఎల్లో మీడియా పనిగట్టుకుని మరీ ప్రభుత్వం బురద చల్లేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించిన కాకాణి...వాటిని నమ్మవద్దని రైతులకు సూచించారు.