బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో?... ఏపీ మంత్రికి టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్!
- హైదరాబాద్‌లో రెండు నిమిషాలు కూడా కరెంట్ పోదు
- హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న జగన్ ఫ్యామిలీని అడిగితే తెలుస్తుంది
- హైదరాబాద్‌లోనూ వైసీపీ నేతల కుటుంబాల నివాసమన్న రంజిత్ రెడ్డి
మీడియాతో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... "తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో. అందుకే కట్ చేశారు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు.