Venkatesh Daggubati: 'ఎఫ్ 3' నుంచి 'ఊ ఆ అహ అహ' సాంగ్ మేకింగ్ వీడియో!

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 3'
  • డబ్బు ఆశ చుట్టూ తిరిగే కథ
  • అదనపు ఆకర్షణగా పూజ .. సోనాల్ చౌహాన్ 
  • మే 27వ తేదీన విడుదల
F3 movie update

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇటీవల 'ఊ ఆ అహ అహ' అనే లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను వదిలారు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ పై ఈ పాటను చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఆ పాట షూటింగు విశేషాలతో కూడిన ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ పాటకి తోడు పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఉండనే ఉంది. 

భార్యలు కోరిన విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి భర్తలుపడే అవస్థల చుట్టూ ఈ కథ నడవనుంది. ఆ విశేషాలను అనిల్ రావిపూడి ఫన్నీగా చూపించనున్నాడు. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. మురళీశర్మ .. సంగీత .. అంజలి .. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మే 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు

  • Loading...

More Telugu News