ఎన్టీఆర్ తో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది: కొరటాల
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ తో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది: కొరటాల

Ntr in Koratala movie
  • 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించానన్న కొరటాల 
  • ఆ కథను ప్రేక్షకులు ఆదరించారని వ్యాఖ్య  
  • 'ఆర్ ఆర్ ఆర్' హిట్ తరువాత తన బాధ్యత పెరిగిందని కామెంట్  
  • మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయన్న కొరటాల
కొరటాల తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' రెడీ అవుతోంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 
 
'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రస్తావన రావడంతో కొరటాల స్పందించారు. 'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో చూపించాను. ఎన్టీఆర్ లుక్ ను ..  పాత్రను కొత్తగా చూపించడం వలన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి అనూహ్యమైన విజయాన్ని ముట్టజెప్పారు. 

ఇటీవల 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయం సాధించిన తరువాత, ఎన్టీఆర్ తో నేను చేయనున్న సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ప్రేక్షకుల అంచనాలకు ఎంతమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ పాత్ర  ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను నెక్స్ట్ లెవెల్లో చూస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను. మాస్ ఎలిమెంట్స్ .. ఎమోషన్స్ విషయంలో ఎంత ఏ మాత్రం తగ్గకుండా ఈ కథ నడుస్తుంది" అని చెప్పుకొచ్చారు.
Choranjeevi
Charan
Koratala
Ntr Movie

More Telugu News