Acharya: చిరంజీవి ఆచార్యకు U/A సర్టిఫికెట్

  • కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య
  • సెన్సార్ పనులు పూర్తి
  • ట్విట్టర్ లో వెల్లడించిన కొణిదెల ప్రొ కంపెనీ
  • రేపు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్
Acharya completes censorship

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని ఆచార్య చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. 'U'ltimate 'A'ction చిత్రాన్ని ఈ నెల 29న థియేటర్లలో చూడండి అంటూ ట్వీట్ చేసింది. 

ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన 'భలే భలే బంజారా' పాటకు విశేష స్పందన లభిస్తోంది. రేపు (ఏప్రిల్ 23) ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగనుంది.

More Telugu News