సీరం బాటలోనే భారత్ బయోటెక్!.. రూ.225లకే కోవాగ్జిన్!
- కోవిషీల్డ్ ధరను తగ్గించిన సీరం
- ఆ వెంటనే కోవాగ్జిన్ ధర తగ్గింపు
- రూ.1,200ల నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సుచిత్రా ఎల్లా ప్రకటన
అయితే దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లు బూస్టర్ డోసుల ధరలను కాస్తంత అధికంగా నిర్ణయించాయన్న వాదన వినిపించింది. దీనిపై పునరాలోచన చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ తన కోవిషీల్డ్ ధరను రూ.600ల నుంచి రూ.225కు తగ్గించింది. సీరం నుంచి ప్రకటన వచ్చినంతనే భారత్ బయోటెక్ కూడా తన కోవాగ్జిన్ ధరను రూ.1,200ల నుంచి రూ.225కు తగ్గించింది. ఈ మేరకు కాసేపటి క్రితం భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ఓ ప్రకటన విడుదల చేశారు. వెరసి బూస్టర్ డోసును ఈ రెండు సంస్థలు రూ.225లకే అందించేందుకు సిద్ధమయ్యాయి.