కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్న రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్న రవితేజ!

Raviteja in Matti Kusthi Movie Update
  • హీరోగా వరుస సినిమాలతో బిజీ 
  • స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు
  • నిర్మాతగాను పెంచుతున్న స్పీడ్ 
  • మల్టీ స్టారర్ లకి మొగ్గుచూపుతున్నట్టే!
టాలీవుడ్లో చాలా ఫాస్టుగా సినిమాలు చేసే స్టార్ హీరోలలో రవితేజ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఏడాదికి మూడు సినిమాలైనా తన నుంచి థియేటర్స్ కి వెళ్లాలనే ఒక బలమైన సంకల్పంతో రవితేజ ముందుకు వెళుతుంటాడు. దాదాపు తన ప్లానింగు దెబ్బతినకుండా చూసుకుంటాడు. అలాగే ఈ సారి కూడా ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు.
 
ఇంతవరకూ సోలో హీరోగానే చేస్తూ వచ్చిన రవితేజ, ఇక ఇతర హీరోల సినిమాలలో ముఖ్యమైన పాత్రలను పోషించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం విశేషం. చిరంజీవి సినిమాలోను .. బాలకృష్ణ సినిమాలోను ఆయన ముఖ్యమైన పాత్రలను చేయనున్నట్టుగా ఒక బలమైన టాక్ వినిపిస్తోంది.

 ఇక కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ హీరోగా చేస్తున్న' మట్టి కుస్తీ' సినిమాలోను రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడని అంటున్నారు. కెరియర్ పరంగా విష్ణు విశాల్ కి ఇది 18వ సినిమా. ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉండటం మరో విశేషం. ఈ సినిమాకి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్నాడు. భవిష్యత్తులో మల్టీ స్టారర్ లు చేయాలనే ఆలోచనతో రవితేజ అటు నుంచి నరుక్కొస్తున్నాడన్న మాట.
Raviteja
Chiranjeevi
Balakridshna

More Telugu News